దారి ఛిద్రం.. పయనమెలా భద్రం
eenadu telugu news
Published : 24/09/2021 06:28 IST

దారి ఛిద్రం.. పయనమెలా భద్రం


రాజానగరం మండలం కొండగుంటూరు వద్ద గుంతలమయంగా రహదారి

ద్వారపూడి నుంచి ఇప్పనపాడు, కేశవరం నుంచి రాజానగరం మీదుగా రాజమహేంద్రవరం వెళ్లే ర.భ.శాఖ రహదారుల దుస్థితికి నిదర్శనాలీ చిత్రాలు. ఒకటి రాళ్లుతేలి నరకం చూపిస్తుంటే.. మరొకటి గుంతలమయమై వెన్నెముకలు విరిచేలా తయారైందని, పడిపోతే ప్రాణాలు పోయేలా ఉందని వాహన చోదకులు వాపోతున్నారు. అయిదు కిలోమీటర్ల పొడవున్న ద్వారాపూడి-ఇప్పనపాడు దారికి రెండేళ్లుగా మరమ్మతులు లేవు. పెద్దపెద్ద గుంతలు పడడంతో ఇటీవల మరమ్మతుల పేరిట రాళ్లు పరిచి వదిలేశారు. కేశవరం-కొండగుంటూరు దారిపై భారీ గుంతల్లో నీరుచేరి మరింత అధ్వానంగా మారింది. వెంటనే వీటిని రాకపోకలకు అనువుగా మార్చే పనులు చేపట్టాలని అంతా కోరుతున్నారు. - ఈనాడు, రాజమహేంద్రవరం

ద్వారపూడి - ఇప్పనపాడు దారిలో ద్విచక్ర వాహనాలపై కూర్చోలేక దిగి నడుస్తున్న మహిళలు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని