ఇవ్వకున్నా ఇచ్చినట్టు.. బియ్యం హాంఫట్‌!
eenadu telugu news
Published : 24/09/2021 06:28 IST

ఇవ్వకున్నా ఇచ్చినట్టు.. బియ్యం హాంఫట్‌!


సచివాలయం ఎదుట నిరసన తెలుపుతున్న లబ్ధిదారులు

ఎటపాక: ఎటపాక మండలం త్రిపురపెంటవీడు సచివాలయం పరిధిలోని నాలుగు క్లస్టర్లలోని 24, 41, 51 చౌక దుకాణాల పరిధిలో సుమారు 200 బియ్యం కార్డులున్నాయి. ప్రతినెలా రేషన్‌ బియ్యం పంపిణీ చేయకుండానే, ఇచ్చినట్లు ఎండీయూ ఆపరేటర్లు ఆన్‌లైన్‌లో చూపిస్తున్నారని, అడిగితే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. మే నుంచి ఆగస్టు వరకు 220 క్వింటాళ్ల బియ్యం ఇవ్వకుండానే, లబ్ధిదారులకు ఇచ్చినట్లు చిత్రీకరించారని ఆరోపించారు. ఇందులో మండలస్థాయి అధికారుల పాత్రకూడా ఉన్నట్లు పేర్కొంటున్నారు. దీనిపై తహసీల్దారు వెంకటేశ్వర్లును వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని