నేడు ఎక్కడికక్కడే బంద్‌
eenadu telugu news
Published : 27/09/2021 04:14 IST

నేడు ఎక్కడికక్కడే బంద్‌

గాంధీనగర్‌ (కాకినాడ): రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోమవారం తలపెట్టిన భారత్‌ బంద్‌ను అన్ని వర్గాల ప్రజలు జయప్రదం చేయాలని వివిధ పక్షాల నాయకులు పిలుపునిచ్చారు. అధికార, ప్రతిపక్షాలైన వైకాపా, తెదేపాతో పాటు కాంగ్రెస్‌, వామపక్షాలు, కార్మిక, రైతు, కర్షక సంఘాలు బంద్‌కు మద్దతు ప్రకటించాయి. ఇప్పటికే జిల్లాలో ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ మద్దతు పలకగా, థియేటర్లను మార్నింగ్‌ షోలు నిలిపేందుకు యాజమాన్యాలు నిర్ణయించాయి. విద్యాసంస్థలు మూతపడనున్నాయి. ఆటో, వాహన రంగ కార్మికులు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరిస్తామని పేర్కొన్నారు.

మధ్యాహ్నం తర్వాతే బస్సులు..

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం): జిల్లాలో సోమవారం ఆర్టీసీ సర్వీసులను మధ్యాహ్నం వరకు నిలిపివేయనున్నారు. తొమ్మిది డిపోల నుంచి ప్రతిరోజూ 862 సర్వీసులు నడుస్తున్నాయి. బంద్‌ కారణంగా వీటిలో సగం సర్వీసులు తగ్గిపోనున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ ఆర్‌ఎం ఆర్‌.వి.ఎస్‌.నాగేశ్వరరావు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని