తప్పిన తుపానుముప్పు
eenadu telugu news
Published : 27/09/2021 04:14 IST

తప్పిన తుపానుముప్పు

కాకినాడ కలెక్టరేట్‌: జిల్లాకు తుపాను ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారిన నేపథ్యంలో జిల్లాపై ప్రభావం ఉంటుందని శనివారం రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఆదివారం భారీ వర్షాలు పడతాయని సూచించినా.. అక్కడక్కడ ఓ మోస్తరుగా కురిశాయి. సోమవారం వర్షాలకు అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో డివిజన్‌ కేంద్రాలు, కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌లు కొనసాగించాలని కలెక్టర్‌ ఆదేశించారు. సహాయ చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. గత 24 గంటల్లో యు.కొత్తపల్లిలో 39.6 మి.మీ, శంఖవరంలో 32.2, రాజవొమ్మంగిలో 26.2, కోటనందూరులో 25.5, చింతూరులో 18.2, అడ్డతీగలలో 17.8, పి.గన్నవరంలో 16.8, గొల్లప్రోలులో 15.2 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని