ఇంకా 5 శాతంపైన..!
eenadu telugu news
Published : 27/09/2021 04:14 IST

ఇంకా 5 శాతంపైన..!

●●● కొనసాగుతున్న కొవిడ్‌ తీవ్రత ●●

18 ఏళ్లు దాటిన వారందరికీ టీకాలు ●●

నేడు 224 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌

టీకా ప్రధాన నిల్వ కేంద్రం

 

కాకినాడ వైద్యం, న్యూస్‌టుడే: దేశవ్యాప్తంగా 70 జిల్లాల్లో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 5 శాతం పైగా కొనసాగుతుండగా.. అందులో మన జిల్లా సైతం ఉంది. కొంత కాలంగా పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కోనసీమ ప్రాంతంలోని రాజోలు, పి.గన్నవరం, ముమ్మిడివరం ప్రాంతాల్లో 8.6 శాతం పాజిటివిటీ ఉన్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ తీవ్రత నేపథ్యంలో జిల్లాలో 18 ఏళ్లు, ఆపైపడిన వారందరికీ కరోనా నివారణ టీకాల తొలి డోసు విధిగా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం టీకా డోసులు పూర్తిస్థాయిలో సరఫరా చేయాలని నిర్ణయించింది. ఆదివారం జిల్లాకు 2.40లక్షల డోసులు సరఫరా చేసింది. ఈ మేరకు జిల్లా అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే రెవెన్యూ, పంచాయతీరాజ్‌, వైద్య, ఆరోగ్య శాఖ, పురపాలక శాఖ అధికారులకు కలెక్టర్‌ సి.హరికిరణ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం చేయాలని టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. సోమవారం నుంచి క్రమం తప్పకుండా టీకాల పంపిణీకి చర్యలు చేపట్టారు.

 

50 సచివాలయాల పరిధిలో..

జిల్లావ్యాప్తంగా సోమవారం 224 వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో 18 ఏళ్లు, ఆ పైన వయసు వారికి టీకాలు వేయడానికి ఏర్పాట్లు చేశారు. అందుకోసం పీహెచ్‌సీలు, సచివాలయాల పరిధిలో కేంద్రాలు సిద్ధం చేశారు. కాకినాడలో 18 ఏళ్లు, ఆపై వయసు వారు ఒక్క డోసు టీకా తీసుకోని వారు 68వేల మంది ఉన్నట్లు గుర్తించారు. రాజమహేంద్రవరం నగరంలో ఇలాంటి వారు 47వేల మంది ఉన్నట్లు తేల్చారు. ఇలా రెవెన్యూ డివిజన్ల వారీగా గుర్తించారు. జిల్లాలో 18, ఆ పైన వయసున్న జనాభా 36,78,951 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 23,39,166 మంది టీకాలు వేయించుకోగా, 13,39,785 మంది తీసుకోలేదు. వీరిలో 90 శాతం అంటే 9,71,890 మందికి ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా టీకాలు వేయాలని నిర్ణయించారు.

ఏర్పాట్లు చేశాం..  - భరతలక్ష్మి, డీఐవో

జిల్లాకు 2.40లక్షల టీకా డోసులు రాగా, వాటిని గుర్తించిన వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు తరలించాం. 18ఏళ్లు, ఆపై వారందరికీ టీకాలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. సచివాలయాల పరిధిలో వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశాం. అక్కడికి వెళ్లి టీకాలు వేయించుకోవాలి.

 

ఇదీ జిల్లాలో పరిస్థితి

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని