సామగ్రి లేకుండా చికిత్సలెలా?
eenadu telugu news
Published : 27/09/2021 04:14 IST

సామగ్రి లేకుండా చికిత్సలెలా?

స్పందించకుంటే విధులు బహిష్కరిస్తామన్న జూనియర్‌ వైద్యులు

మసీదు సెంటర్‌ (కాకినాడ), న్యూస్‌టుడే: నెల రోజులుగా జీజీహెచ్‌లో గ్లౌజులు, మందులు అందుబాటులో లేవని.. అవి లేకుండా రోగులకు వైద్య సేవలు ఎలా అందించగలమని జూనియర్‌ వైద్యుల సంఘం ప్రశ్నించింది. వీటిని వెంటనే సమకూర్చకపోతే 29వ తేదీ నుంచి విధులను బహిష్కరిస్తామని పేర్కొంటూ జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ మహాలక్ష్మి, ఆర్‌ఎంసీ ప్రిన్సిపల్‌ బాబ్జీకి వినతి పత్రాల్ని అందజేశారు. ఆసుపత్రిలోని పలు వార్డులు, క్యాజువాలిటీ, అత్యవసర విభాగాల్లో మందులు, సర్జికల్‌ వస్తువులు అందుబాటులో లేకపోవడంతో దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. మందులు, సామగ్రి అందుబాటులోకి రాకుంటే 27వ తేదీ నుంచి ఓపీ, వార్డు సేవలు నిలిపివేస్తామని, 29వ తేదీ నుంచి అన్ని అత్యవసర, ఐసీయూ సేవలు సైతం నిలిపివేస్తామని లేఖలో పేర్కొన్నారు. దీనిపై జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ను వివరణ కోరగా.. ఈ విషయమై కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా లోకల్‌ పర్చేజ్‌ చేయమన్నారని తెలిపారు. కొంతమేర మందులు అందుబాటులో ఉంచామన్నారు. 29న సీడీఎస్‌ ద్వారా పూర్తిస్థాయిలో సమకూరుతాయన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని