సజావుగా ఆర్‌జేయూకేటీ ప్రవేశ పరీక్ష
eenadu telugu news
Published : 27/09/2021 04:14 IST

సజావుగా ఆర్‌జేయూకేటీ ప్రవేశ పరీక్ష


రాజమహేంద్రవరంలోని ఓ పాఠశాలలో పరిశీలిస్తున్న డీఈవో అబ్రహం

కాకినాడ నగరం, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ (ట్రిపుల్‌ ఐటీ) ప్రవేశాలకు సంబంధించి ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని 36 కేంద్రాల్లో 5,246 మందికి గాను 5,023 మంది పరీక్షకు హాజరయ్యారు. ఉదయం 11 నుంచి ఒంటి గంట వరకు జరిగింది. కాకినాడ, రాజమహేంద్రరం నగరాలు, తుని, రామచంద్రపురం, పిఠాపురం, మండపేట తదితర పట్టణాలు, మండల కేంద్రాల్లో నిర్వహించారు. రాజమహేంద్రవరంలోని ఎస్‌కేవీటీ పాఠశాలలో జరిగిన పరీక్షను డీఈవో ఎస్‌.అబ్రహం పరిశీలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని