వాణిజ్య ఉత్సవ్‌తో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మేలు
eenadu telugu news
Published : 27/09/2021 04:14 IST

వాణిజ్య ఉత్సవ్‌తో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మేలు

సర్పవరం జంక్షన్‌, న్యూస్‌టుడే: కాకినాడలో ఏపీఐఐసీ, జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా నిర్వహించిన జిల్లా వాణిజ్య ఉత్సవం 2021 ఆదివారంతో ముగిసింది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన వివిధ ప్రాంతాలకు చెందిన పారిశ్రామిక ఉత్పత్తులు ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం శ్రీనివాసరావు, ఏపీఐఐసీ జడ్‌ఎం సుధాకర్‌ మాట్లాడుతూ... ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఈ ఉత్సవ్‌ ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. ఆహార శుద్ధి ఉత్పత్తులు, సిరామిక్‌, పారిశ్రామిక విడిభాగాలు, చేనేత వస్త్రాలు, ఫోం ఉత్పత్తులు, ఫర్నీ చర్‌, కొబ్బరి ఆధార ఉత్పత్తులు, హస్తకళల అలంకరణ వస్తువులు, అగరబత్తీలు, విద్యుత్తు పరికరాలు, వంటనూనెలు, డెయిరీ ఉత్పత్తులు, సేంద్రియ కూరగాయల విత్తనాల కొనుగోలు అధికంగా జరిగాయాన్నారు. డీఐసీ ఐపీవో దొర, ఏపీఐఐసీ మేనేజర్‌ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని