పర్యాటకం.. ప్రగతి ఆవాశ్యకం
eenadu telugu news
Published : 27/09/2021 04:14 IST

పర్యాటకం.. ప్రగతి ఆవాశ్యకం

జిల్లా కేంద్రంతోపాటు కళలకు నిలయమైన రాజమహేంద్రవరం, ప్రకృతిఅందాల నిలయం మన్యంలో ఆధ్యాత్మిక, దర్శనీయ ప్రాంతాలుఆహ్లాదాన్నిస్తున్నాయి. కొవిడ్‌ తదితర కారణాలతో కొన్నాళ్లుగాస్తంభించిన పర్యాటకం తిరిగి కళకళలాడాలంటేఆయా ప్రాంతాల్లో మరింత అభివృద్ధిచేయడంతోపాటు ఉపాధి అవకాశాలుపెంచాల్సిఉంది. ప్రపంచ దినోత్సవంసందర్భంగాకథనం.

 

ఆనందధామం..కోకెనడా..

ఎన్టీఆర్‌ బీచ్‌ పార్కు

కాకినాడ(గాంధీనగర్‌): నింగిలోని నీలి ఆకాశాన్ని ముద్దాడేలా కనిపించే కడలి కెరటాలు.. వాటి సవ్వడికి సమ్మోహనంగా కదిలే తరువుల మడ అడవులు.. వంపుల్లేని రహదారులు.. నాటి డచ్‌, ఫ్రెంచ్‌, బ్రిటిష్‌ వారినుంచి నేటి ఆధునిక కాలంలోనూ ఎగుమతులకు నిలయమైన ఓడరేవు, సినిమా సన్నివేశాల చిత్రీకరణలకు ఆలవాలమైన పరిసరాలతో కాకినాడ నగరం పర్యాటకంలో కో‘కెనడా’గా పేరుగాంచింది. ఎన్టీఆర్‌ బీచ్‌, శిల్పారామం ఉల్లాస వేదికలుగా ఉన్నాయి. బీచ్‌లో మరో ప్రత్యేక ఆకర్షణగా యుద్ధ విమాన ప్రదర్శన నిలుస్తోంది. అలాంటి ఈ ప్రాంతానికి కొవిడ్‌ నేపథ్యంలో పర్యాటకులు రావడం తగ్గిపోయింది. మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు రచించిన ప్రణాళికలను వెంటనే అమల్లోకి తేవాలనేది పర్యాటకుల ఆకాంక్ష. నగరంలోని చారిత్రక కట్టడాలనూ అభివృద్ధి చేయాల్సిఉంది.

గోదారి తీరం.. అభివృద్ధికి ఆహ్వానం

పుష్కరఘాట్లో నిత్యహారతి వేడుక

రాజమహేంద్రవరం సాంస్కృతికం: గోదావరిలో బోటు ప్రయాణం చేస్తూ.. సెల్ఫీలు దిగుతూ.. సామాజిక మాధ్యమాల్లో ఉంచాలనుకోని వారుండరు. అంతటి రమణీయత రాజమహేంద్రవరం నగర పరిధిలోని నదీ ప్రాంతం సొంతం. కొన్నేళ్లుగా దర్శనీయ ప్రాంతాలు ఆశించిన ప్రగతికి నోచుకోవడం లేదు. హేవ్‌లాక్‌ వంతెన, పిచ్చుకల్లంక ప్రాజెక్టులు పట్టాలెక్కాల్సిఉంది. కొవిడ్‌ నిబంధనల్లో భాగంగా ఏప్రిల్‌ 28 నుంచి పుష్కరఘాట్‌ వద్ద నిర్వహించే నిత్యహారతిని రద్దు చేశారు. సాయంత్రం వేళ నగరవాసులు, పర్యాటకులు ఘాట్‌లోని మెట్లపై సేదదీరి వీక్షించే హారతిని మళ్లీ ఆరంభించాలని కోరుకుంటున్నారు. పండుగల సీజన్‌లో నిబంధనల అమలుతో ప్రారంభించాలని ఆశిస్తున్నారు. బోటు షికారునూ ఆరంభించే రోజులకోసం ఎదురుచూస్తున్నారు. కందుకూరి వీరేశలింగం జన్మగృహం, పురమందిరం, రాళ్లబండి మ్యూజియం తదితరాలనూ తీర్చిదిద్దాలని విన్నవిస్తున్నారు.

పాపికొండలు..పలకరింపెన్నడు..?

పోశమ్మగండి వద్దే నిలిచిపోయిన బోట్లు

దేవీపట్నం: పోశమ్మగండి వద్ద నుంచి 22 పర్యాటక బోట్లు, వీఆర్‌పురం మండలం పోచవరం నుంచి 20 బోట్లు, 10 లాంచీలపై నిత్యం వెయ్యి నుంచి 1,500 మందిపైగా పాపికొండలు విహారయాత్రకు వెళ్లేవారు. 2019 సెప్టెంబరు 15న దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద పాపికొండలకు వెళ్తున్న పర్యాటక బోటు మునిగిన ప్రమాదం తరువాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ప్రభుత్వం పాపికొండలు పర్యాటకాన్ని నిలిపేసింది. సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాది జులైలో ఏపీ టూరిజం శాఖకు చెందిన పర్యాటక బోటుకు అనుమతులు మంజూరు చేసినా.. వారమే నడిచింది. గోదావరికి వరద నీరు పోటెత్తడంతో మళ్లీ పర్యాటకం నిలిచిపోయింది. దాంతో పర్యాటక బోట్లపై ఆధారపడిన రెండు వేల కుటుంబాలకుపైగా జీవనాధారం కోల్పోతున్నారు. రెండేళ్లుగా బోట్లు నడవక ఆర్థికంగా అప్పులపాలవు తున్నామని గోదావరి గ్రాండ్‌-1, 2 బోట్ల నిర్వాహకుడు బుడ్డిగ రాము వాపోతున్నారు. పది మందితో భోజనాలు తయారు చేయించేవాళ్లమని, అలాంటిది తమకే ఉపాధి పోయిందని పోశమ్మగండికి చెందిన భోజనశాల నిర్వాహకుడు బొచ్చు అప్పారావు, నాడు రెండు బోట్లకు మేనేజరుగా ఉండి, ఇప్పుడు కూలి పనులకు వెళ్తున్నానని కండిపల్లి రాజు అనే వ్యక్తులు ఆవేదనతో చెబుతున్నారు. ప్రత్యామ్నాయ ఉపాధి చూపించడం, పర్యాటకాన్ని తిరిగి కళకళలాడేలా చేయడం తమ ఆకాంక్షలని చెబుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని