ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్ల సంఘం ఏర్పాటు
eenadu telugu news
Published : 27/09/2021 04:14 IST

ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్ల సంఘం ఏర్పాటు


నూతన కార్యవర్గ సభ్యులు

కాకినాడ కలెక్టరేట్‌: ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్స్‌, విస్తరణాధికారుల సంఘం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికయింది. ఆదివారం స్థానిక ఏపీఎన్జీవో భవన్‌లో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అసోసియేషన్‌ ప్రతినిధులు జె.రేఖారాణి (విశాఖపట్నం), కె.రాధిక (విజయనగరం) ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. సంఘం జిల్లా అధ్యక్షురాలిగా జి.సత్యశ్రీ (కొత్తపేట), సహ అధ్యక్షురాలిగా యు.పద్మ (రంగంపేట), ప్రధాన కార్యదర్శిగా పి.క్రాంతికుమారి (రంపచోడవరం), కోశాధికారిగా కె.వాణి (రంగంపేట), ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్శులు ముగ్గురు చొప్పున, ఆరుగురు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని