శ్రీనివాసుని కల్యాణం.. శోభాయమానం
eenadu telugu news
Published : 27/09/2021 04:14 IST

శ్రీనివాసుని కల్యాణం.. శోభాయమానం


వేడుక నిర్వహిస్తున్న అర్చకులు

ఆత్రేయపురం, న్యూస్‌టుడే: వాడపల్లి వేంకటేశ్వరుని దివ్యక్షేత్రంలో ఆదివారం స్వామివారి కల్యాణం శోభాయమానంగా జరిగింది. దర్శనం టికెట్లు, ప్రసాదాల అమ్మకాలు తదితర ఆదాయం రూ.1.18 లక్షలు వచ్చింది. దేవస్థానం ఈవో ముదునూరి సత్యనారాయణరాజు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అభివృద్ధి పనులపై ఆదివారం దేవస్థాన పాలకమండలి చర్చించింది. ఛైర్మన్‌ రుద్రరాజు రమేష్‌రాజు అధ్యక్షతన పలు నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం మంజూరు చేసిన రూ.2 కోట్లతో అన్నదాన భవనం నిర్మించేందుకు చర్యలు తీసుకొంటున్నట్లు ఈవో సత్యనారాయణరాజు తెలిపారు. ఏఈ ఉదయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని