ఆయువు తీసిన ఆవేశం
eenadu telugu news
Published : 15/10/2021 02:20 IST

ఆయువు తీసిన ఆవేశం

భార్యను హత్య చేసిన భర్త


భవాని(పాత చిత్రం)

పామర్రు: ఆవేశానికి లోనైన భర్త చేతిలో వివాహిత హత్యకు గురైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. కె.గంగవరం మండలం తామరపల్లికి చెందిన భవానికి కపిలేశ్వరపురం మండలం నాగులచెరువుకు చెందిన మేడిశెట్టి శ్రీనుతో 15 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె ఉంది. నాలుగేళ్లపాటు కాపురం సజావుగానే సాగినా.. తరువాత గొడవలు మొదలయ్యాయి. విడిపోవడం..పెద్దలు సర్దిచెప్పడంతో తిరిగి కలుసుకోవడం జరుగుతుండేది. గత కొంతకాలంగా వీరి కుటుంబం తామరపల్లిలోనే ఉంటోంది. మంగళవారం రాత్రి భార్య, భర్తల మధ్యన గొడవ జరిగింది. ఆ సమయంలో ఆవేశానికి గురైన శ్రీను పదునైన ఆయుధంతో భార్య తలపై కొట్టి చంపేసి, కుమార్తె శిరీషను తీసుకొని వెళ్లిపోయాడని.. ఈ విషయం బుధవారం రాత్రి వారి ఇంటికి వెళ్లినప్పుడు తెలిసిందని మృతురాలి తండ్రి శేషారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై కె.చిరంజీవి సంఘటనా స్థలాన్ని గురువారం పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామచంద్రపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని