వ్యసనాలకు బానిసలై చోరీలు
eenadu telugu news
Published : 15/10/2021 02:20 IST

వ్యసనాలకు బానిసలై చోరీలు

ముగ్గురు యువకుల అరెస్టు


స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తుతో డీఎస్పీ, సీఐ, ఎస్సై, సిబ్బంది

మండపేట: వ్యసనాలకు బానిసలై చోరీలు వృత్తిగా చేసుకున్న ముగ్గురు యువకులు గురువారం పోలీసులకు చిక్కారు. రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి గురువారం స్థానిక పోలీస్టేషను వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. గత నెల 10న స్థానిక సంకావారి వీధిలోని బురుగుంట చెరువు సమీపంలోనున్న బంగారం దుకాణంలో చోరీ జరిగింది. ఆ కేసు విచారణలో భాగంగా మండపేట రూరల్‌ సీఐ శివగణేష్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీ బృందాలు ఏర్పాటు చేశారు. గురువారం ఏడిద రోడ్డులో రెండు ద్విచక్ర వాహనాలపై వెళుతున్న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు తూర్పు వీధికి చెందిన కోసూరి రమేష్‌, తాడేపల్లిగూడేనికి చెందిన ఆరేటి పండు, మండపేటకు చెందిన వాసంశెట్టి దుర్గాప్రసాద్‌ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొని విచారించడంతో చోరీల విషయం వెలుగు చూసింది. వారి నుంచి వివిధ ప్రాంతాల్లో చోరీ చేసిన రూ.5.67 లక్షల విలువైన 126 గ్రాముల బంగారు నగలు, రూ.3,96,500 విలువైన 6.5 కిలోల వెండి వస్తువులు, రూ.10,13,500 విలువైన రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రమేష్‌, పండు గతంలో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి జైలుశిక్ష అనుభవించినట్లు డీఎస్పీ తెలిపారు. వీరితో మండపేటకు చెందిన వాసంశెట్టి దుర్గాప్రసాద్‌కు కొంత కాలం కిందట పరిచయమైందన్నారు. ఆయన రామచంద్రపురంలోని బంగారం దుకాణంలో చేసేవాడని, ఖాళీ సమయంలో ముగ్గురు కలిసి చోరీలకు పాల్పడేవాడన్నారు. కేసు ఛేదించిన రూరల్‌ సీఐ శివగణేష్‌, పట్టణ ఎస్సై బి.రాజేష్‌కుమార్‌, క్రైమ్‌బ్రాంచ్‌ పోలీసులు సీిహెచ్‌. ఎసుకుమార్‌, ఎ.చంద్రశేఖర్‌, పి.నారాయణ, హోమ్‌గార్డు రమేష్‌ తదితరులను డీఎస్పీ అభినందించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని