చిన్నారి... జాడేది? 
eenadu telugu news
Updated : 15/10/2021 06:20 IST

చిన్నారి... జాడేది? 


బిడ్డను అపహరించిన మహిళ

 

రాజమహేంద్రవరం నగరం, న్యూస్‌టుడే: విశాఖపట్నం-కాచీగూడ రైలులో గత నెల 30వ తేదీ రాత్రి అపహరణకు గురైన చిన్నారి(18 నెలలు) జాడా ఇంకా లభ్యం కాలేదు. కేసులో గాలింపు కొనసాగుతోందని రాజమహేంద్రవరం ప్రభుత్వ రైల్వే పోలీసు సీఐ పి.విజయశంకర్‌ గురువారం తెలిపారు. ఇప్పటికే రాజమహేంద్రవరం నగరం, గ్రామీణ ప్రాంతాలతో పాటు సమీప ప్రాంతాల్లోనూ గాలింపు చేపట్టామన్నారు. చిన్నారిని అపహరించిన మహిళ అదే రోజు విశాఖపట్నం రైల్వేస్టేషను బయట వివిధ ప్రాంతాల్లో సంచరించిన సీసీ టీవీ ఫుటేజీలను తమ సిబ్బంది సేకరించారన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని