ప్రాణాలు బలిగొన్న నిద్రమత్తు 
eenadu telugu news
Updated : 15/10/2021 06:21 IST

ప్రాణాలు బలిగొన్న నిద్రమత్తు 


భర్త నాగు, కుమార్తె వీరలక్ష్మితో దుర్గాదేవి (పాత చిత్రం)

 

దేవరపల్లి, ప్రత్తిపాడు: డ్రైవరు నిద్రమత్తు కారణంగా జరిగిన ప్రమాదం రెండునిండు ప్రాణాలను బలి తీసుకుంది. కట్టుకున్న భర్త, కన్నకూతురు కళ్ల ముందే చనిపోవడంతో ఆమె విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఇదే ఘటనలో మరో 10 మంది గాయపడ్డారు. దేవరపల్లి ఎస్సై శ్రీహరిరావు, గ్రామస్థుల వివరాల మేరకు.. ప్రత్తిపాడు మండలం గజ్జనపూడికి చెందిన 12 మంది బుధవారం టాటా మ్యాజిక్‌ వాహనంలో విజయవాడ దుర్గమ్మ గుడికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గురువారం తెల్లవారుజాముకు పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి గ్రామ శివారుకు చేరుకున్నారు. డ్రైవరు మానెం చంటి కునుకు తీయడంతో వ్యాను అదుపుతప్పింది. గుండుగొలను- కొవ్వూరు జాతీయ రహదారి సమీపంలో నిర్మించిన ఇనుపకంచెను తెంచుకుని దాని వెనుక ఉన్న డ్రెయిన్‌లోకి దూసుకుపోయింది. వ్యాను ముందుభాగంలో కూర్చున్న లోకా నాగు(30) తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందారు. ఆయన కుమార్తె వీరలక్ష్మి(3)కి తీవ్రగాయాలు కావడంతో స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ మృతి చెందింది. డ్రైవర్‌ చంటికి బలమైన గాయం కావడంతో రాజమహేంద్రవరం తరలించారు.

రెప్పపాటులో అంతా..

● నాగు, దుర్గాదేవిలకు పెళ్లైన కొన్నేళ్ల తర్వాత పాప పుట్టింది. రెక్కల కష్టాన్ని నమ్ముకుంటూ ఉన్నంతలో ఆనందంగా జీవిస్తున్నారు. రెప్పపాటులో జరిగిన ప్రమాదం ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. భర్త, కూతురు దూరమై ఆమె ఒంటరి అయిందని బంధువులు విలపించసాగారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని