కాకినాడ ఇన్‌ఛార్జి మేయర్‌గా వెంకటసత్యప్రసాద్‌
eenadu telugu news
Published : 15/10/2021 02:20 IST

కాకినాడ ఇన్‌ఛార్జి మేయర్‌గా వెంకటసత్యప్రసాద్‌


బాధ్యతలు స్వీకరిస్తున్న సత్యప్రసాద్‌

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: కాకినాడ నగర పాలక సంస్థ ఇన్‌ఛార్జి మేయర్‌గా ఉపమేయర్‌-2 వెంకట సత్యప్రసాద్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. తెదేపాకు చెందిన మేయర్‌ పావనిపై అవిశ్వాసం ప్రకటించడం, దానికి పలువురు సభ్యులు మద్దతు తెలపడం తెలిసిందే. అయితే అవిశ్వాస ప్రక్రియ పూర్తయినా ఫలితం రిజర్వులో ఉంచారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల కిందట మేయర్‌ పదవి నుంచి పావనిని తొలగిస్తూ గెజిట్‌ జారీ చేసింది. మున్సిపల్‌ చట్టం ప్రకారం మేయర్‌ పదవి ఖాళీ అయితే ఆ బాధ్యతలు డిప్యూటీ మేయర్‌ స్వీకరించాలి. దాంతో ఉపమేయర్‌-2గా ఉన్న సత్యప్రసాద్‌ సహచర కార్పొరేటర్ల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని