జగన్‌ అసమర్థతతో.. అప్పులపాలు: యనమల
eenadu telugu news
Published : 15/10/2021 02:20 IST

జగన్‌ అసమర్థతతో.. అప్పులపాలు: యనమల


పెదశంకర్లపూడిలో తెదేపా కార్యాలయం ప్రారంభిస్తున్న యనమల. నాయకులు

చినరాజప్ప, అయ్యన్నపాత్రుడు, బండారు తదితరులు

ప్రత్తిపాడు: సీఎం జగన్‌అసమర్థతతోనే రాష్ట్రం అప్పుల పాలైందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. పెదశంకర్లపూడిలో తెదేపా బాధ్యుడు వరుపుల రాజా ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించిన తరువాత ఆయన మాట్లాడుతూ, నెలకు రూ.2 వేల కోట్లు అప్పు చేస్తే తప్ప ప్రభుత్వం నడవట్లేదన్నారు. ఆర్థిక క్రమశిక్షణ లేదనీ.. సలహాదారులను నియమించుకోవడం, ఖర్చు చేయడం ఘనకార్యంగా మారిందని విమర్శించారు. ఇప్పటికే ప్రభుత్వం రూ.లక్షన్నర కోట్లకు లెక్క చెప్పాల్సి ఉందన్నారు. అసమర్థత కప్పిపుచ్చుకోవడానికి ప్రకటనలు గుప్పిస్తున్నారని అన్నారు. అమ్మఒడి.. తల్లి ఖాతాకు జమచేయడంలో అభ్యంతరం లేదని, ఆ మొత్తం సమయానికి అక్కరకు రావట్లేదన్నారు. గతంలో రూ.70 వేలు వస్తే ఇపుడు రూ.30 వేలూ రావట్లేదని విద్యార్థులే చెబుతున్నారన్నారు. 23 లక్షల రేషన్‌ కార్డులు తీసేశారన్నారు. బీసీలకు 34 శాతం నుంచి 24 రిజర్వేషన్‌ తగ్గించడంతో నష్టపోయారన్నారు.

మాజీ మంత్రి అయ్యన్నమాట్లాడుతూ జైల్లో కూర్చున్న వ్యక్తి ఏం పాలన చేయగలడో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ వైకాపా వంచనను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ముఖ్య నాయకులు బండారు సత్యనారాయణ మూర్తి, అనిత, జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్‌, రెడ్డి సుబ్రహ్మణ్యం, పెందుర్తి వెంకటేశ్‌, దాట్ల బుచ్చిబాబు, పిల్లి అనంతలక్ష్మి, బండారు సత్యానందరావు తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని