ఫేస్‌బుక్‌ స్నేహం : రూ.3.87 లక్షలు దోపిడీ
eenadu telugu news
Published : 15/10/2021 02:20 IST

ఫేస్‌బుక్‌ స్నేహం : రూ.3.87 లక్షలు దోపిడీ

రాజమహేంద్రవరం నేరవార్తలు, న్యూస్‌టుడే: ఫేస్‌బుక్‌లో పరిచయం... స్నేహంగా మారి రూ.లక్షలు దోపిడీ చేసిన ఘటనపై రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలో కేసు నమోదైంది. సీఐ మధుబాబు తెలిపిన వివరాల ప్రకారం.. వీవర్స్‌కాలనీకి చెందిన ఎస్‌.సురేష్‌ ఫ్లబింగ్‌ పనులు చేస్తుంటాడు. అతడికి గత ఆగస్టులో కాలిఫోర్నియా చెందిన జమ్మ కొసియ ట్రెట్లే పేరిట ఓ మహిళ ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. నిత్యం ఆమెతో ఛాటింగ్‌ చేసేవాడు. ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. రూ.కోటి విలువచేసే బహుమతులు పంపుతున్నానని, వాటికి కొద్ది మొత్తంలో పన్ను చెల్లించాలని సంబంధిత మహిళ సురేష్‌కు చెప్పింది. దీంతో పది దఫాలుగా రూ.3.87 లక్షలను ఆమె బ్యాంకు ఖాతాకు గూగుల్‌ పే ద్వారా చెల్లించాడు. ఆమె వద్ద నుంచి ఎటువంటి బహుమతులు రాకపోవడం, ఈ నెల 13న మరికొంత నగదును పంపమని కోరడంతో సురేష్‌కు అనుమానం వచ్చి నిలదీశాడు. తర్వాత ఆమె వద్ద నుంచి ఎటువంటి సందేశాలు రాలేదు. మోసపోయానని గ్రహించిన బాధితుడు గురువారం పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని