గోదారిలో మొసలి
eenadu telugu news
Published : 15/10/2021 02:20 IST

గోదారిలో మొసలి


మత్స్యకారుల వలకు చిక్కిన మొసలి

 

ఆత్రేయపురం, రాజానగరం: గోదావరిలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు గురువారం మొసలి చిక్కడంతో ఒక్కసారిగా వారంతా హడలెత్తిపోయారు. వద్దిపర్రుకు చెందిన బోడ్డు పోచయ్య, భైరవస్వామి, అన్నవరం, శ్రీను, మల్లాడి గంగరాజు చేపల వేటకు వెళ్లగా వలలో మొసలి చిక్కుకుని వెనక్కిలాగడంతో భయాందోళనకు గురయ్యారు. వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించగా.. అతికష్టం మీద ఒడ్డుకు తీసుకొచ్చారు. తహసీల్దారు ఎం.రామకృష్ణ వన్యప్రాణుల విభాగపు అధికారి వి.వేణుగోపాల్‌కు సమాచారమిచ్చారు. అతను ప్రథమ చికిత్స చేసిన తర్వాత పాపికొండలు జాతీయ పార్కులో విడిచిపెట్టారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని