చారిత్రక బౌద్ధ స్తూప దర్శనం మహద్భాగ్యం
eenadu telugu news
Published : 15/10/2021 02:20 IST

చారిత్రక బౌద్ధ స్తూప దర్శనం మహద్భాగ్యం


ఆదుర్రు ఆది బౌద్ధ స్తూపం వద్ద జ్యోతి వెలిగిస్తున్న బౌద్ధ భిక్షువు అనాలయోబంతే

మామిడికుదురు, న్యూస్‌టుడే: ఆదుర్రులోని చారిత్రక బౌద్ధ స్తూప దర్శనం మహద్భాగ్యమని ప్రముఖ బౌద్ధ భిక్షువు అనాలయో బంతే పేర్కొన్నారు. ఆదుర్రులోని ఆది బౌద్ధ స్తూపం వద్ద బీఆర్‌ అంబేడ్కర్‌ 65వ దమ్మ దీక్షా మహోత్సవం సందర్భంగా గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తొలుత పంచశీల పతాకాన్ని ఆవిష్కరించి ప్రధాన స్తూపం చుట్టూ భక్తులలో కలిసి ప్రదక్షిణ చేశారు. అక్కడ జ్యోతి వెలిగించిన అనంతరం సామూహికంగా బుద్ధ, దమ్మ, సంఘ వందనాలు నిర్వహించారు. అక్కడ నూతన బుద్ధ విహార్‌ను ప్రారంభించారు. అంబేడ్కర్‌ రచించిన పలు గ్రంథాలను ఆవిష్కరించారు. బీఎస్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.ఎస్‌.ఆర్‌.భూపతి, చింతా శ్రీరామమూర్తి, పెనుమాల సుధీర్‌, కె.కె.రాజా, ఎస్‌.వరుణ్‌కుమార్‌, బుద్ధ విహార్‌ నిర్వాహకులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని