నిర్లక్ష్యం.. బలిగొన్న నిండు ప్రాణం
eenadu telugu news
Published : 15/10/2021 02:20 IST

నిర్లక్ష్యం.. బలిగొన్న నిండు ప్రాణం

రంపచోడవరం: స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా సకాలంలో వైద్య సేవలు అందక పోవడం వల్ల గురువారం రాత్రి జమ్మల భూదేవి (45) మృతి చెందింది. ఆమె కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. వై.రామవరం మండలం తోటకూరపాలేనికి చెందిన ఆమె ఆయాసం, దగ్గుతో బాధపడుతూ సోమవారం వై.రామవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా, మెరుగైన వైద్యం కోసం అదే రోజు రంపచోడవరం తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రాజమహేంద్రవరం ఆసుపత్రికి రిఫర్‌ చేసి, అంబులెన్స్‌ వస్తుందని చెప్పి వెళ్లిపోయారు. సాయంత్రం 6.30 గంటల వరకు వాహనం రాలేదు.. ఇంతలో పరిస్థితి విషమించి మృతి చెందిందని ఆమె కుమారుడు విశ్వనాథం తెలిపారు. ఆసుపత్రిలో మూడు అంబులెన్సులు అందుబాటులో ఉన్నా తీసుకెళ్లలేదని కన్నీరుమున్నీరయ్యాడు. దీనిపై ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కార్తీక్‌ను వివరణ కోరగా.. అంబులెన్సులు అందుబాటులో లేవని రోగి బంధువులకు సిబ్బంది చెప్పిన విషయం తనకు తెలియదన్నారు. రోగిని రాజమంద్రవరం రిఫర్‌ చేసినట్లు తన దృష్టికి రాలేదని, ఆ సమయంలో తాను ఐటీడీఏ పీవో సమీక్షలో ఉన్నానని తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని