భూముల స్వాధీనానికి ప్రత్యేక బృందాలు
eenadu telugu news
Published : 15/10/2021 02:20 IST

భూముల స్వాధీనానికి ప్రత్యేక బృందాలు


మాట్లాడుతున్న డీసీ విజయరాజు, ఏసీ ప్రసాద్‌ తదితరులు

 

గాంధీనగర్‌(కాకినాడ), న్యూస్‌టుడే: జిల్లాలో దేవాదాయ శాఖకు చెందిన 430 ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని ఆ శాఖ డిప్యూటీ కమిషనర్‌ మేడేపల్లి విజయరాజు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 926 సంస్థలకు చెందిన 70 వేల ఎకరాల భూమి కబ్జాకు గురైందని, ఇకపై అటువంటి కబ్జాలను ఉపేక్షించమని దీనిపై ప్రత్యేక బృందాలతో స్వాధీనానికి కృషి చేస్తామన్నారు. గురువారం కాకినాడలోని కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్యాక్రాంతమైన భూముల స్వాధీనం కోసం ప్రతి జిల్లాలో ఎస్పీ, డీఎస్పీ, సీఐ, ఎస్సై స్థాయి, అలాగే ఆర్డీవో, తహసీల్దార్‌, సర్వేయర్లతో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసేందుకు క్యాబినెట్‌ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. మూడు, ఐదు సంవత్సరాల లీజులు పూర్తయిన భూములు, దుకాణాలు అనేక మంది ఖాళీ చేయడం లేదని, వాటిని ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి 15 రోజుల్లో నోటీసు జారీ చేసి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ కె.ఎన్‌.వి.డి.ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని