18న ఉద్యోగ మేళా
eenadu telugu news
Published : 15/10/2021 02:20 IST

18న ఉద్యోగ మేళా

కాకినాడ కలెక్టరేట్‌: కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయం వద్ద ఈనెల 18న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు వికాస పీడీ కె.లచ్చారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డెక్కన్‌ కెమికల్స్‌, హోండాయ్‌ మొబీస్‌, బిగ్‌-సీ, సిటీ ఆన్‌లైన్‌, బేబీ వరల్డ్‌, ఎంఎన్‌సీ సంస్థల్లో బీపీవో, ఎగ్జిక్యూటివ్‌, క్యాషియర్‌, హార్డ్‌వేర్‌ అండ్‌ నెట్‌వర్కింగ్‌ ఇంజినీరు, స్టాక్‌ ఇన్‌ఛార్జి, బిల్లింగ్‌ ఇన్‌ఛార్జి, టెక్నీషియన్‌, ట్రైనీ (ప్రొడక్షన్‌) ఉద్యోగాలకు ముఖాముఖి నిర్వహించనున్నట్లు తెలిపారు. పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ, బి-ఫార్మసీ, డి-ఫార్మసీ, బీఎస్సీ (కెమిస్ట్రీ), ఐటీఐ, డిప్లమో, బీటెక్‌ (ఈఈఈ, ఈసీఈ, మెకానికల్‌, ఆటోమొబైల్‌) కోర్సుల్లో ఉత్తీర్ణులు అర్హులని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు సోమవారం ఉదయం 9 గంటలకు విద్యార్హత పత్రాలతో వికాస కార్యాలయం వద్ద హాజరుకావాలని కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని