అర్చకుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
eenadu telugu news
Published : 18/10/2021 01:30 IST

అర్చకుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

రాజమహేంద్రవరం సాంస్కృతికం, గాంధీనగర్‌, ద్రాక్షారామ: దేవాదాయ ధర్మాదాయశాఖ పరిధిలోని 6 ఏ, బీ, సీ, దేవాలయాల్లో పనిచేస్తున్నవారు వంశ పారంపర్య అర్చకులుగా నిర్ధారణకు 43(10)లో నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని ఆ శాఖ సహాయ కమిషనర్‌ కె.ఎన్‌.వి.డి.వి.ప్రసాద్‌ ఓ ప్రకటనలో తెలిపారు. 6(సి) దేవాలయాల్లో పనిచేస్తున్న వంశపారంపర్య అర్చకులు రాజమహేంద్రవరంలోని సహాయ కమిషనర్‌, 6(బి) దేవాలయాల్లో పనిచేస్తున్నవారు కాకినాడలోని ఉప కమిషనర్‌ కార్యాలయాల్లో సంప్రదించాలన్నారు. 6(ఎ) దేవాలయాల పరిధి రూ.కోటిలోపు ఆదాయం గల వాటిల్లో పనిచేస్తున్నవారు రాజమహేంద్రవరంలోని ప్రాంతీయ సంయుక్త కమిషనర్‌, రూ.కోటి పైబడి ఆదాయం గల వాటిల్లో విధులు చేపడుతున్నవారు విజయవాడలోని కమిషనర్‌కు పది రోజుల్లోగా సంబంధిత పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని