కొనసాగుతున్న ప్రయాణికుల రద్దీ
eenadu telugu news
Published : 18/10/2021 01:30 IST

కొనసాగుతున్న ప్రయాణికుల రద్దీ

బస్సుల కోసం నిరీక్షణ

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: ఆర్టీసీలో తిరుగు ప్రయాణికుల రద్దీ కొనసాగింది. దసరాకు సొంతూళ్లకు వచ్చివారిలో ఎక్కువ మంది ఆదివారం తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్లు ఉదయం నుంచి ప్రయాణికులతో కిటకిటలాడాయి. తొమ్మిది డిపోల నుంచి ఆయా రూట్లలో మొత్తం 770 షెడ్యూల్‌ బస్సులు నడుస్తుండగా ఈ ఒక్కరోజే ఆక్యుఫెన్సీ రేషియో(ఓఆర్‌) 70 శాతంపైగా పెరిగినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్‌ 10, విజయవాడకు 15, విశాఖకు 25 ప్రత్యేక సర్వీసులు నడిపినట్లు చెప్పారు.

రైల్వేస్టేషనులో...

రాజమహేంద్రవరం నగరం: దసరా పండగ సెలవులు ముగియడంతో తిరుగు ప్రయాణాలతో రాజమహేంద్రవరం రైల్వేస్టేషనులో ఆదివారం రద్దీ వాతావరణం కనిపించింది. ఈ స్టేషను నుంచి విశాఖపట్నం, విజయవాడ మార్గంలో సాధారణ ప్రత్యేక ప్రయాణికుల రైళ్లు, వారాంతపు రైళ్లు సుమారు 56 రాకపోకలు సాగిస్తున్నాయి. సుమారు 15 వేల మందికి పైగా ప్రయాణికులు ఆదివారం రాకపోకలు సాగించినట్లు అధికారులు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని