పురపాలికల్లోవ్యాధులపడగ
eenadu telugu news
Published : 18/10/2021 01:30 IST

పురపాలికల్లోవ్యాధులపడగ

డెంగీ, విష జ్వరాల విజృంభణ


కంబాలపేటలో క్లస్టర్‌ పాయింట్‌ వద్ద పారిశుద్ధ్య పరిస్థితి

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ : జిల్లాలోని పురపాలికల్లో సీజనల్‌ వ్యాధులతో ప్రైవేట్‌ ఆసుపత్రుల వెంట పట్టణవాసులు పరుగులు పెడుతున్నారు. విష జ్వరాలు (అంటు వ్యాధులు), డెంగీ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ప్రధానంగా డెంగీ కారణంగా రక్తంలో ప్లేట్‌లెట్‌లు పడిపోయి ఎక్కువ శాతం మంది ఆసుపత్రుల పాలవుతున్నారు. సీజనల్‌ వ్యాధులపై వైద్య బృందాలు ప్రజల్లో అవగాహన కల్పించాల్సి ఉంది. వ్యాధులు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దోమలను అరికట్టేందుకు పరిసరాల పరిశుభ్రత తదితర విషయాలపై అప్రమత్తం చేయాల్సి ఉంటుంది. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడ నగరపాలక సంస్థలతోపాటు పలు పురపాలికల్లో గత మూడు నెలల కాలంలో 981 మంది విష జ్వరాలతో బాధపడగా, వీటిలో డెంగీ కేసులు 106 ఉన్నాయి. మండపేట మున్సిపాలిటీ, ముమ్మిడివరం నగర పంచాయతీ మినహా మిగతాచోట్ల కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వర్షాకాలంలో తాగునీటి వల్ల ఉదర సంబంధిత వ్యాధుల వచ్చిన వారి సంఖ్య 104 ఉండగా, అతిసార కేసులు 19, టైఫాయిడ్‌ కేసులు 141 ఉన్నాయి.

నియంత్రణ ఏదీ?

పురపాలికల్లో ఏటా సీజనల్‌ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉంది. దోమ కాటు వల్ల డెంగీవంటి ప్రాణాంతక వ్యాధులు విస్తరిస్తున్న తరుణంలో వాటిని అరికట్టాల్సి ఉంది. వాస్తవానికి వర్షాకాలం సీజన్‌ ఆరంభంలోనే దోమలను లార్వా దశలోనే నిర్మూలించాల్సి ఉంది. మలేరియా, టైఫాయిడ్‌, విష జ్వరాలు కూడా దోమల వల్ల మాత్రమే వచ్చేందుకు ఆస్కారం ఉండడంతో వాటి ఉత్పత్తిని ప్రణాళికాబద్ధంగా నిర్మూలన చేయాల్సి ఉంది.

రూ.కోట్లు కేటాయిస్తున్నా..

ఏటా దోమల నివారణకు పురపాలక సంఘాల్లో సొంత నిధులు వెచ్చిస్తారు. రాజమహేంద్రవరం, కాకినాడ కార్పొరేషన్లలో ఏడాదికి దోమలు అరికట్టేందుకు రూ.75 లక్షల నుంచి కోటి వరకూ కేటాయిస్తారు. గుడ్ల దశలోనే నాశనం చేసేందుకు మందు పిచికారీ చేయడంతోపాటు వీధుల్లో వారానికి రెండుసార్లు ఫాగింగ్‌ చేయాలి. ఇవన్నీ మొక్కుబడిగా సాగుతున్నాయి.

అమల్లోకి రాని క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌

మున్సిపాల్టీలతోపాటు జిల్లాలోని రెండు నగరాల్లో క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా తడి, పొడి చెత్తను ఇళ్ల నుంచి తరలించేందుకు చేపట్టిన ప్రక్రియ అమల్లోకి రాలేదు. వాహనాలు అందుబాటులోకి రాకపోగా, ముందుగా వీధుల్లో చెత్తను నిల్వ చేసేందుకు కేటాయించిన డంపర్లను తొలగించారు. దీంతో చెత్తను క్లస్టర్‌ పాయింట్‌లు ఏర్పాటు చేసి ఒకచోట వేస్తుండడంతో సమస్య మరింత తీవ్రంగా మారుతోంది.

చర్యలు తీసుకుంటున్నాం..

జిల్లాలోని పురపాలికల్లో సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాం. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రోగ్రాం పూర్తిస్థాయిలో అమలు జరిగితే జిల్లాలో పారిశుద్ధ్య పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఇంటింటా చెత్త సేకరణకు కేటాయించిన సీఎన్‌జీ వాహనాలు నేరుగా వీధుల్లోకి వెళ్లి చెత్తను సేకరిస్తాయి. తద్వారా ఎప్పటికప్పుడు చెత్త తొలగించేందుకు ఆస్కారం ఉంటుంది. తడి, పొడి చెత్తను వేరు చేసే ప్రక్రియ వేగవంతం చేయడం ద్వారా నగరాలు శుభ్రపడతాయి. - సత్యనారాయణ, మున్సిపల్‌ ఆర్డీ

ఆగస్టు 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఇదీ పరిస్థితి...

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని