గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం
eenadu telugu news
Published : 18/10/2021 01:30 IST

గంజాయి సాగు, రవాణాపై ఉక్కుపాదం

మాట్లాడుతున్న డీఐజీ మోహన్‌రావు

మారేడుమిల్లి: గంజాయి సాగు, రవాణాలపై ప్రభుత్వ శాఖలు, ప్రజల సహకారంతో ఉక్కుపాదం మోపుతామని ఏలూరు రేంజి డీఐజీ కేవీ మోహన్‌రావు పేర్కొన్నారు. మారేడుమిల్లిలో ఆదివారం ఆయన ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా రాత్రి మారేడుమిల్లి పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి సాగు జరుగుతోందన్నారు. డ్రోన్ల సహాయంతో వాటిని గుర్తించి, పోలీసు, ఎక్సైజ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, అటవీశాఖల సహకారంతో ధ్వంసం చేస్తున్నట్లు చెప్పారు. రవాణా మార్గాలను, వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు చేపడుతున్నామన్నారు. ఇటీవల ద్రవరూపంలోనూ గంజాయి తరలిస్తున్నారన్నారు. రేంజి పరిధిలో గత మూడేళ్లలో 842 కేసులు నమోదు కాగా, 1,53,781 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. మారేడుమిల్లి పోలీస్‌స్టేషన్‌లోనే సుమారు 80 కేసుల నమోదు కాగా, 38వేల కిలోల గంజాయి పట్టుకున్నట్లు చెప్పారు. కోర్టు అనుమతితో ఆ సరకును త్వరలో ధ్వంసం చేస్తామన్నారు. మారేడుమిల్లి సీఐ రవికుమార్‌, ఎస్సై రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని