గూడు లేక.. ఆదరణకు నోచుకోక
eenadu telugu news
Published : 18/10/2021 01:30 IST

గూడు లేక.. ఆదరణకు నోచుకోక

ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధ దంపతులు పట్టణంలో ప్లాస్టిక్‌ కవర్లు, కాగితాలు వేరుకుంటూ విక్రయించడం ద్వారా వచ్చే ఆదాయంతో సంత మార్కెట్‌లోని ఓ తాటాకు పాకలో తలదాచుకుని జీవనం సాగిస్తున్నారు. విశాఖ జిల్లా నాతవరం మండలం తాండ గ్రామానికి చెందిన వీరు చాలా రోజుల క్రితం పట్టణానికి వచ్చారు. మార్కెట్‌లోని వ్యాపారులు తోచిన సాయం చేస్తుంటారు. లంబాడి రామదాసుకు ఇటీవల ఆరోగ్య సమస్యతో బాధపడుతూ వైద్య సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అధికారులు స్పందించి అతనికి శస్త్రచికిత్స చేయించి ఎక్కడైనా ఆశ్రయం కల్పించాలని కోరుతున్నారు.- న్యూస్‌టుడే, పెద్దాపురం


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని