పుస్తకావిష్కరణ
eenadu telugu news
Published : 18/10/2021 01:30 IST

పుస్తకావిష్కరణ


పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు

కడియం: నర్సరీ రంగంలో తనదైన ముద్ర వేసిన పల్ల వెంకన్న జీవిత చరిత్ర పుస్తకాన్ని హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం ఆవిష్కరించారు. ‘నర్సరీ రాజ్యానికి రారాజు’ పేరిట ఎమెస్కో సంస్థ ఆధ్వర్యంలో పాత్రికేయిడు జి.వల్లీశ్వర్‌ ఈ పుస్తకాన్ని రచించారు. కార్యక్రమంలో తెలంగాణ హోంమంత్రి మహ్మద్‌ అలీ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌, వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్‌, ఇండియన్‌ నర్సరీమెన్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు పల్ల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని