రెండు ద్విచక్ర వాహనాలకు రూ.10 వేలు జరిమానా
eenadu telugu news
Published : 18/10/2021 01:30 IST

రెండు ద్విచక్ర వాహనాలకు రూ.10 వేలు జరిమానా

బిక్కవోలు ఎస్సై తీరుపై పండ్రవాడలో ఆందోళన


అపరాధ రుసుం రసీదు

సామర్లకోట గ్రామీణం: సామర్లకోట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గ్రామంలో బిక్కవోలు ఎస్సై అక్రమంగా కేసులు నమోదు చేశారని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. సామర్లకోట మండలం పండ్రవాడలో రోడ్డు పక్కన నిలుపుదల చేసిన వాహనాలకు బిక్కవోలు ఎస్సై పలివెల శ్రీనివాస్‌ ఫొటోలు తీసి అక్రమంగా రూ.10 వేలు అపరాధ రుసుం విధించారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఎస్సై తన మావయ్య ఇంటికి వెళ్తుండగా రోడ్డు పక్కన ఉన్న కోడి విజయ్‌కుమార్‌, పెంకే శ్రీనివాస్‌ వాహనాలు ఒక్కో దానికి రూ.5035 చొప్పన అపరాధ రుసుం విధించారని వాపోయారు. తమ వాహనాలకు అక్రమంగా ఎందుకు అపరాధ రుసుం వేశారని ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు. ఎస్సై తీరుకు నిరసనగా ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న సామర్లకోట ఎస్సై అభిమన్యు సంఘటన స్థలానికి చేరుకుని స్థానికులతో చర్చలు జరపడంతో ఆందోళన విరమించారు. దీనిపై సోమవారం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ విషయాన్ని సీఐ జయకుమార్‌ వద్ద ప్రస్తావించగా ఎస్సై తన పరిధి దాటి కేసు నమోదుచేయటం సరికాదన్నారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని