‘చౌక’ దందాకు చెక్‌
eenadu telugu news
Published : 19/10/2021 04:43 IST

‘చౌక’ దందాకు చెక్‌


వివరాలు వెల్లడిస్తున్న అధికారులు

మండపేట గ్రామీణం: గ్రామస్థులు అందించిన సమాచారంతో రీసైక్లింగ్‌ నిమిత్తం తీసుకొచ్చిన 12.65 మెట్రిక్‌ టన్నుల చౌక బియ్యాన్ని మండపేట మండలం కేశవరం బీడుమెట్ట వద్ద సోమవారం స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్‌ సీఐ రమేష్‌ తెలిపారు. కృష్ణా జిల్లాకు చెందిన మినీ లారీలో 253 సంచుల్లో 12.65 మెట్రిక్‌ టన్నుల చౌక బియ్యాన్ని రాజమహేంద్రవరం బైపాస్‌ నుంచి రాజవోలు మీదుగా కేశవరంలోని బీడుమెట్ట వద్దకు తీసుకొచ్చినట్లు తెలిపారు. రాత్రి సమయంలో మిల్లుకు తరలించి వాటిని రీసైకిలింగ్‌ చేసేందుకు రంగం సిద్ధం చేశారన్నారు. చౌక బియ్యం బస్తాలతో ఉన్న ఆ లారీని ఉదయం స్థానికులు గమనించి తమకు సమాచారం అందించడంతో దాడి చేసి పట్టుకున్నామన్నారు. పట్టుబడిన బియ్యం విలువ రూ.4.75 లక్షలు ఉంటుందన్నారు. బియ్యం బస్తాలను విజిలెన్స్‌ తహసీల్దారు విజయకుమార్‌ పరిశీలించారని, సరకు ఎంఎస్‌వో పద్మకు స్వాధీనం చేసినట్లు సీఐ వివరించారు. లారీ యజమాని, పరారీలో ఉన్న డ్రైవరు, క్లీనరు, ఇతర నిందితులపై మండపేట రూరల్‌ పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదైంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని