అలిగి వెళ్లి.. శవమై తేలి..
eenadu telugu news
Published : 19/10/2021 04:43 IST

అలిగి వెళ్లి.. శవమై తేలి..


ప్రశాంత్‌ (పాత చిత్రం)

 

సర్పవరం జంక్షన్‌, న్యూస్‌టుడే: ఒక్కగానొక్క కొడుకు కావడంతో అల్లారు ముద్ద్గుగా పెంచారు. ఇటీవల చదువుపై శ్రద్ధ పెట్టకుండా కంప్యూటర్‌లో ఆటలకు ప్రాధాన్యం ఇస్తున్నాడని తండ్రి మందలించారని అలిగి ఇంటి నుంచి వెళ్లిన బాలుడు ఇంటి సమీపంలోని చెరువులో శవమై తేలాడు. కొడుకు మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు బోరున విలపించారు. కాకినాడ గ్రామీణం సర్పవరం పోలీస్‌ స్టేషన్‌ సీఐ రాజశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సర్పవరం జంక్షన్‌కు చెందిన హజీబు భీముడు కుమారుడు హజీబు సూర్యశ్రీఫణిప్రశాంత్‌ (15) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. కంప్యూటర్‌లో ఆటలు ఆడుతూ చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడని శనివారం తండ్రి కుమారుడిని మందలించారు. దీంతో ఎవరికీ చెప్పకుండా సూర్యశ్రీఫణిప్రశాంత్‌ ఇంటిలో నుంచి బయటకు వెళ్లిపోయాడు. సోమవారం ఉదయం కాకినాడ అర్బన్‌ 1వ డివిజన్‌ బోటుక్లబ్‌ ఉద్యానం చెరువులో శవమై కనిపించాడు. ఆత్మహత్య చేసుకున్నట్టుగా కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని