అట్రాసిటీ కేసులు కొలిక్కి తేవాలి
eenadu telugu news
Published : 19/10/2021 04:43 IST

అట్రాసిటీ కేసులు కొలిక్కి తేవాలి


సిబ్బందితో మాట్లాడుతున్న డీఐజీ

రాజమహేంద్రవరం నేరవార్తలు: ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీసులు బాధ్యత వహించాలని ఏలూరు రేంజి డీఐజీ కె.వి.మోహన్‌రావు పేర్కొన్నారు. సోమవారం ఉదయం రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా పరిధిలోని ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌ను ఆయన పరిశీలించారు. ముందుగా గౌరవ వందనం స్వీకరించిన అనంతరం స్టేషన్‌ సిబ్బంది పనితీరు, కేసుల దర్యాప్తు, విజిబుల్‌ పోలీసింగ్‌, పిటిషన్‌ మేనేజ్‌మెంట్‌, డయల్‌ 100 కాల్స్‌పై స్పందన తదితర అంశాలపై సంబంధిత డీఎస్పీ సంతోష్‌, సీఐ గోవింద రాజుతో చర్చించారు. స్టేషన్‌ రికార్డులను పరిశీలించిన తదుపరి అట్రాసిటీ కేసులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. స్టేషన్‌ సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి డీఎస్పీ, సీఐలకు పలు సూచనలు చేశారు. ఏఎస్పీ లతామాధురి, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తదితరులు డీఐజీ వెంట ఉన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని