స్పందనకు వినతుల హోరు
eenadu telugu news
Published : 19/10/2021 04:43 IST

స్పందనకు వినతుల హోరు


ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌, ఇతర అధికారులు

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందనలో 397 అర్జీలు దాఖలయ్యాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు ఇళ్ల పట్టాలు, గృహాల మంజూరు, ఉద్యోగ, ఉపాధి కల్పన, పింఛన్లు, ఉపకార వేతనాలు, బియ్యం కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, వైఎస్‌ఆర్‌ బీమా, సర్వే, భూ సమస్యలు, తదితర అంశాలపై అర్జీలు దాఖలు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టర్‌ సి.హరికిరణ్‌, సంయుక్త కలెక్టర్లు లక్ష్మీశ, కీర్తి, డీఆర్వో సత్తిబాబు వినతులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ జిల్లాస్థాయి అధికారులతో సమీక్షించారు. అర్జీలు గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతివారం నిర్వహించే వీడియోకాన్ఫరెన్స్‌కు మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు ప్రధాన కేంద్రాల నుంచి హాజరుకావాలని ఆదేశించారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి కోర్టులో దాఖలైన కేసులపై సమీక్షించారు.

25న ఎస్సీ, ఎస్టీలకు స్పందన: వచ్చే సోమవారం 25న మధ్యాహ్నం 3 గంటల నుంచి కలెక్టరేట్‌ స్పందన మందిరంలో ప్రత్యేక గ్రీవెన్స్‌సెల్‌ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ప్రకటించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ప్రతివారం మాదిరిగానే స్పందన జరుగుతుందని, మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎస్సీ,ఎస్టీ వర్గాలకు ప్రత్యేకంగా స్పందన నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనిలో ఈ వర్గాల ప్రజలు మాత్రమే అర్జీలు అందజేయాలని కోరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని