ఏఎస్పీలుగా ఏడుగురికి అర్హత
eenadu telugu news
Published : 19/10/2021 04:43 IST

ఏఎస్పీలుగా ఏడుగురికి అర్హత

బాలాజీచెరువు(కాకినాడ), న్యూస్‌టుడే: జిల్లా పోలీసు, రాజమహేంద్రవరం అర్బన్‌లో పనిచేస్తున్న ఏడుగురు డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా(సివిల్‌)గా అర్హత కల్పించారు. అదనపు ఎస్పీ(సివిల్‌) 2021-22 ప్యానల్‌కు సంబంధించి వీరు ఉద్యోగోన్నతులకు అర్హులుగా గుర్తించారు. వీరి సమాచారాన్ని ఆయా పోలీస్‌ యూనిట్‌ అధికారులు సమగ్రంగా అందజేయాలని డీజీపీ కార్యాలయం ఉత్తర్వుల్లో ఆదేశించింది. ఏఎస్పీలుగా అర్హత సాధించిన వారిలో కాకినాడ ఎస్‌డీపీవో వి.భీమారావు, జిల్లా పోలీసు కార్యాలయం ఎస్‌బీ డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, రాజమహేంద్రవరం అర్బన్‌కు సంబంధించి దిశ డీఎస్పీ కె.తిరుమలరావు, సెంట్రల్‌ డీఎస్పీ జేవీ సంతోష్‌, తూర్పు డీఎస్పీ ఏటీవీ రవికుమార్‌, సీసీఎస్‌ డీఎస్పీ ఎంజేవీ భాస్కరరావు, ఏపీఎస్పీ మూడో బెటాలియన్‌ డీఎస్పీ పి.శంకర్‌ ఉన్నారు. వీరి ఉద్యోగోన్నతులకు సంబంధించి అన్నీ సక్రమంగా ఉంటే త్వరలో ఏఎస్పీలుగా నియమితులు అవుతారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని