ఏ... ఆధారమూ లేదండి!
eenadu telugu news
Published : 19/10/2021 04:43 IST

ఏ... ఆధారమూ లేదండి!

బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న కుమార్తె అచ్యుతామణిని తన మరదలు మంగ సాయంతో తీసుకొస్తున్న ఈమె పేరు చక్రమ్మ. కాకినాడ గ్రామీణ మండలం పండూరు నివాసి. చక్రమ్మ కూలి పనులు చేసుకుంటూ తన కుమార్తెకు ప్రభుత్వం అందించే పింఛనుతో ఇద్దరూ బతుకుతున్నారు. ఆధార్‌ కార్డులో తప్పుల కారణంగా నాలుగు నెలలుగా పింఛను ఆగిపోయింది.. సమస్యను గ్రామ సచివాలయం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదు. దీంతో వారు సోమవారం కాకినాడ కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో తమ గోడును వెళ్లబోసుకున్నారు. పింఛను తప్ప తమకు ఏ ఆధారం లేదని తల్లి చక్రమ్మ వాపోయింది. - ఈనాడు, కాకినాడ


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని