సచివాలయ వ్యవస్థతో మెరుగైన సేవలు
eenadu telugu news
Published : 19/10/2021 04:43 IST

సచివాలయ వ్యవస్థతో మెరుగైన సేవలు


మహిళలతో మాట్లాడుతున్న మంత్రి కన్నబాబు

సర్పవరం జంక్షన్‌: సచివాలయం వ్యసస్థ, వాలంటీర్ల పనితీరు తదితర అంశాలను పరిశీలించి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ గ్రామీణం వలసపాకల గ్రామంలో సోమవారం ఆయన 1, 2, 3 సచివాలయాల పనితీరు, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో సుమారు 900 మందికి త్వరలో పట్టాలిస్తామని తెలిపారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో జడ్పీటీసీ సభ్యుడు నులుకుర్తి రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధికి పాటుపడిన మాజీ ప్రజాప్రతినిధులకు మంత్రి చేతుల మీదుగా సన్మానించారు. తరువాత మండల మత్స్యకార మహిళ సమాఖ్య సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు కురసాల సత్యనారాయణ, ఎంపీపీ గోపిశెట్టి పద్మజ, వైస్‌ ఎంపీపీ బందిలి విరీష, తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని