వామపక్ష రైతు సంఘాల నాయకుల గృహనిర్బంధం
eenadu telugu news
Published : 19/10/2021 04:43 IST

వామపక్ష రైతు సంఘాల నాయకుల గృహనిర్బంధం


పోలీసుల పర్యవేక్షణలో సీపీఐ జిల్లా కార్యదర్శి మధు

 

కాకినాడ(గాంధీనగర్‌): అఖిల భారత రైతు సంఘాల సమన్వయ కమిటీ పిలుపు మేరకు సోమవారం దేశవ్యాప్త రైల్‌రోకో కార్యక్రమానికి సిద్ధమైన వామపక్ష, రైతు సంఘాల నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. సోమవారం ఉదయాన్నే సీపీీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, నాయకుడు టి.ప్రసాద్‌, రైతు సంఘ జిల్లా కార్యదర్శి ఎం.రాజశేఖర్‌, ఇఫ్టూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, తిరుమలశెట్టి నాగేశ్వరరావు, సీీపీఎం నాయకులు ఎం.రాజశేఖర్‌, శేషబాబ్జి తదితరులను అడ్డుకున్నారు. రైతు సంఘాల సమాఖ్య జిల్లా కార్యదర్శి సతీష్‌, రైతు కూలీ సంఘ నాయకులు చిట్టిబాబు, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

రాజమహేంద్రవరంలో...

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలో పలువురు వామపక్ష పార్టీల నేతలు, రైతు, ప్రజాసంఘాల నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు టి.ఎస్‌.ప్రకాష్‌, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎస్‌.ఎస్‌.మూర్తి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు బి.పవన్‌లను సోమవారం స్థానిక సీపీఎం కార్యాలయం వద్ద పోలీసులు నిర్బంధించారు. సీపీఐ నగర కార్యదర్శి నల్లా రామారావు, నాయకురాలు రమణ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం.రాజశేఖర్‌, జ్యోతిరాజు, నాగేశ్వరరావు తదితర నాయకులను గృహనిర్బంధం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని