విద్యుదాఘాతంతో ఆటోవాలా మృతి
eenadu telugu news
Published : 20/10/2021 02:53 IST

విద్యుదాఘాతంతో ఆటోవాలా మృతి


సత్యనారాయణ

 

ఉప్పలగుప్తం, న్యూస్‌టుడే: చల్లపల్లికి చెందిన మేకల సత్యనారాయణ(55) మంగళవారం ఇంటి ఆవరణలోని షెడ్డుపై ఉన్న సిమెంటు రేకుల కట్లను తొలగిస్తుండగా.. విద్యుదాఘాతానికి గురై కింద పడిపోయాడు. కుటుంబసభ్యులు అమలాపురంలో ఆసుపత్రికి తరలించారు. అతను మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సత్యనారాయణకు భార్య, నలుగురు కుమారులున్నారు. కుమారుడు సురేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు. వ్యవసాయం, ఆటో జీవనాధారంగా, అందరితో కలిసిమెలిసి ఉండేవాడని గ్రామస్థులు పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని