‘త్రిమూర్తులును ఎమ్మెల్సీగా బర్తరఫ్‌ చేయాలి’
eenadu telugu news
Published : 20/10/2021 02:53 IST

‘త్రిమూర్తులును ఎమ్మెల్సీగా బర్తరఫ్‌ చేయాలి’


మాట్లాడుతున్న రామేశ్వరరావు

గాంధీనగర్‌ (కాకినాడ): రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి దళితులు ప్రధాన భూమిక పోషించారని.. అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యుడు అయితాబత్తుల రామేశ్వరరావు ఆరోపించారు. స్థానిక కచేరిపేటలోని సుందరయ్యభవన్‌లో దళిత, మైనార్టీ హక్కుల, వామపక్ష, విప్లవ, ప్రజా సంఘాల ఐక్యవేదిక సమావేశం మంగళవారం జరిగింది. వెంకటాయపాలెం శిరోముండనం కేసుకు సంబంధించి తోట త్రిమూర్తులును ఎమ్మెల్సీ నుంచి బర్తరఫ్‌ చేయాలన్నారు. దళితులపై దాడులకు నిరసనగా బుధవారం నుంచి నవంబర్‌ 2వ తేదీ వరకు మండల కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించాలని, నవంబర్‌ 3న కలెక్టరేట్‌ ముట్టడి చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. వివిధ సంఘాల నాయకులు దువ్వా శేషబాబ్జి, జె.వెంకటేశ్వర్లు, ఎం.రాజశేఖర్‌, పావన ప్రసాద్‌, సూరిబాబు, ఆర్‌.సతీష్‌, ఏనుగుపల్లి కృష్ణ, కోటేశ్వరరావు, గుడాల కృష్ణ, రాజబాబు, సత్యానందం తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని