‘అమూల్య’ బాధిత రైతులకు నష్టపరిహారం
eenadu telugu news
Published : 20/10/2021 02:53 IST

‘అమూల్య’ బాధిత రైతులకు నష్టపరిహారం

సర్పవరం జంక్షన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో అమూల్య వరి విత్తనాలు వేసి నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం ఇస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. తన క్యాంపు కార్యాలయంలో జేడీఏ విజయకుమార్‌, ఇతర అధికారులతో మంగళవారం సమీక్షించారు. అమూల్య రకం వరి విత్తనాలు విక్రయించిన మహేంద్ర సీడ్స్‌, వరంగల్‌ సంస్థ ప్రతినిధులను వెంటనే పిలిపించి వ్యవసాయ శాస్త్రవేత్తల సమక్షంలో నష్టపరిహారం నిర్ణయించి వీలైనంత త్వరగా రైతులకు అందించాలన్నారు. జేడీఏ మాట్లాడుతూ 2020-21 ఖరీఫ్‌లో జిల్లాలోని 14 మండలాల్లో 1,545 మంది రైతులు 5182.91 ఎకరాల్లో అమూల్య వరి విత్తనాలు సాగు చేశారని వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని