రూ.10 లక్షల విలువైన గుట్కా స్వాధీనం
eenadu telugu news
Published : 20/10/2021 02:53 IST

రూ.10 లక్షల విలువైన గుట్కా స్వాధీనం

అన్నవరం, న్యూస్‌టుడే: అన్నవరంలో రూ.10 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెద్దాపురం డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు, ప్రత్తిపాడు ఇన్‌ఛార్జి సీఐ కిషోర్‌బాబుకు అందిన సమాచారం మేరకు మంగళవారం ఎస్సై రవికుమార్‌తో కలిసి జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేశారు. తుని నుంచి కత్తిపూడి వైపు వెళ్తున్న వ్యాన్‌ను తనిఖీ చేస్తుండగా అందులోని డ్రైవర్‌తోపాటు మరో ముగ్గురు పరారయ్యేందుకు ప్రయత్నించారు. పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో పది బస్తాల్లో గుట్కా ప్యాకెట్లు, 180- డీలక్స్‌ ప్యాకెట్లు, 10 మందుసీసాలు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీటివిలువ రూ.10 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని