బడిబాటన వెళ్లేదెలా పాఠం వినేదెలా..
eenadu telugu news
Published : 20/10/2021 02:53 IST

బడిబాటన వెళ్లేదెలా పాఠం వినేదెలా..

పి.గన్నవరంలోని ఎంపీపీ ప్రాథమిక పాఠశాల (మెయిన్‌)లో సుమారు 230 మంది విద్యార్థులు చదువుతున్నారు. ‘నాడు-నేడు’ కింద దీనిని అభివృద్ధి చేశారు. పాఠశాలకు వెళ్లే ప్రధాన రహదారి మాత్రం అధ్వానంగా ఉంది. ఇళ్లలోంచి మురుగు ఈ రహదారిపైకి చేరుతోంది. ఇటీవల రూ.16 లక్షలతో సిమెంటు దారి, పక్కా డ్రెయిన్‌ నిర్మించేందుకుగాను ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు రెండు నెలల క్రితం శంకుస్థాపన చేశారు. ఇంతవరకు పని మొదలు పెట్టలేదు. రహదారిపై మురుగు నిలిచి దుర్వాసన వ్యాపిస్తోంది. విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం. ఈ పనిచేసేందుకు ఎవరూ ముందుకురావడం లేదని పంచాయతీ కార్యదర్శి కుమార్‌ తెలిపారు. - న్యూస్‌టుడే, పి.గన్నవరం


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని