ఆకుపచ్చ వర్ణంవిషంలేని సర్పం..
eenadu telugu news
Published : 20/10/2021 02:53 IST

ఆకుపచ్చ వర్ణంవిషంలేని సర్పం..

ప్రత్తిపాడు మండలం తోటపల్లిలోని శాంతిఆశ్రమంలో మంగళవారం అరుదైన పాము కనిపించింది. నాలుగు అడుగుల పొడవున్న ఈ సర్పాన్ని ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించే సీతబాబు గుర్తించారు. దీని గురించి రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కళాశాల జంతుశాస్త్ర విభాగాధిపతి కె.బాబును సంప్రదించగా వీటిని గ్రీన్‌ కీల్‌ బ్యాక్‌ అంటారని చెప్పారు. ఇవి అరుదుగా ఉంటాయని, భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో, శ్రీలంకలో కనిపిస్తాయన్నారు. వీటికి విషం ఉండదన్నారు. ఎలుకలు, కప్పలు తింటాయన్నారు. - న్యూస్‌టుడే, ప్రత్తిపాడు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని