విద్యతో ప్రగతి
eenadu telugu news
Published : 20/10/2021 02:53 IST

విద్యతో ప్రగతి


బాలికకు పురస్కారమందిస్తున్న ఎంపీ గీత, ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి

కాకినాడ కలెక్టరేట్‌: మహిళా విద్యను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని.. విద్యతోనే ప్రగతి సాధించవచ్చని ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. స్థానిక సూర్యకళా మందిరంలో కోరమాండల్‌ (మురుగప్ప గ్రూప్‌) ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత బాలికలకు ప్రతిభా పురస్కారాలను మంగళవారం అందజేశారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ బాలికలు ఉన్నత విద్యను అభ్యసించి, సమాజానికి సేవలందించాలని ఆకాక్షించారు. కోరమాండల్‌ రీజియన్‌ బిజినెస్‌ హెడ్‌ కేఎస్‌ఆర్‌ చక్రవర్తి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభావంతులైన 200 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ.3,500 నుంచి రూ.5,000 వరకు ప్రోత్సాహకం అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యే పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో కుడా ఛైర్మన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, వ్యవసాయ శాఖ జేడీ విజయకుమార్‌, కోరమాండల్‌ ప్రతినిధులు సుధాకర్‌, కీర్తికృష్ణ, రామోజీ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని