‘కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ’
eenadu telugu news
Published : 22/10/2021 05:59 IST

‘కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ’

కాకినాడ కలెక్టరేట్‌: ఏడేళ్ల మోదీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు అన్నారు. గురువారం కాకినాడలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బడ్జెట్‌ను సమతూకం చేయడానికి ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మోదీ పాలనలో మైనార్టీలు, రైతులకు రక్షణ లేదన్నారు. చైనా సరిహద్దుల్లో 50 వేల మంది సైనికులను పెట్టారనీ, దీంతో దేశంపై ఆర్థిక భారం పెరిగిందన్నారు. మన్మోహన్‌సింగ్‌ పాలనలో చైనాతో సత్సంబంధాలు మెరుగుపరుచుకుని.. సరిహద్దుల్లో గొడవలు ఉన్నాసర్దిచెప్పేవారని అన్నారు. ప్రధాని మోదీ తీరుతోనేవేల మంది చైనా సరిహద్దుల్లో ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఏపీలో ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే చాలా బాధగా ఉందన్నారు. ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయడంతో ప్రజల్లో గౌరవం లేకుండా పోయిందన్నారు. జగన్‌ అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తాము కూడా వైఎస్‌ హయాంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, అభివృద్ధి చేశామన్నారు. ప్రస్తుతం ఏపీలో అభివృద్ధి లేదన్నారు మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని