అమరవీరులకు... వందనం
eenadu telugu news
Published : 22/10/2021 05:59 IST

అమరవీరులకు... వందనం

 


కాకినాడ: నివాళి అర్పిస్తున్న మంత్రి కన్నబాబు, ఎంపీలు బోస్‌, గీత, కలెక్టర్‌ హరికిరణ్‌, ఎస్పీ రవీంద్రనాథ్‌

 

బాలాజీచెరువు (కాకినాడ): దేశం కోసం ప్రాణాలు అర్పించి.. అమరులైన పోలీసు కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి కన్నబాబు తెలిపారు. గురువారం జిల్లా పోలీసు కవాతు మైదానం వద్ద జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం నిర్వహించారు. మంత్రి ప్రత్యేక పోలీసు స్మృతి కవాతు నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత పోలీసు అమరవీరుల స్తూపం వద్ద మంత్రి, ఎంపీలు బోస్‌, గీత, కలెక్టర్‌ హరికిరణ్‌, ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు పుష్పాంజలి ఘటించారు. కొవిడ్‌ వేళ విధి నిర్వహణలో మరణించిన పోలీసు కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందజేశారు. 14 కుటుంబాలకు భద్రత ఎక్స్‌గ్రేషియా కింద రూ.5 లక్షలు, సెంట్రల్‌ వెల్ఫేర్‌ ఫండ్‌ నుంచి రూ.5 లక్షలు చొప్పున చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. మావోయిస్టు దాడుల్లో అమరులైన 19 మంది పోలీసు కుటుంబాలకు రూ.10 వేలు చొప్పున సాయాన్ని ఎంపీలు బోస్‌, గీత అందజేశారు. మావోయిస్టు దాడుల్లో మృతి చెందిన పోలీసు కుటుంబాలకు ఇళ్ల స్థలాల మంజూరు అంశం పెండింగ్‌లో ఉందని ఎస్ఫీ. మంత్రికి చెప్పగా.. వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. మంత్రి మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో పోలీసుల సేవలు ఎనలేనివన్నారు. కవాతు మైదానం నుంచి భానుగుడి కూడలి వరకు ప్రదర్శన చేపట్టగా ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.

● రాజమహేంద్రవరం నేరవార్తలు: అమరులైన పోలీసు కుటుంబాలకు అండగా ఉంటామని ఎంపీ భరత్‌, అర్బన్‌ ఎస్పీ ఐశ్వర్య రస్తోగి పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా అర్బన్‌ జిల్లా పోలీసు కార్యాలయంలో అమరవీరుల స్తూపం వద్ద ఎంపీ, ఎస్పీ, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొని నివాళి అర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ, అర్బన్‌ పరిధిలో కరోనాతోఆరుగురు సిబ్బంది మృతి చెందారన్నారు. రూ.10 లక్షలు చొప్పున వారి కుటుంబాలకు చెక్కులు అందజేశారు.రుడా ఛైర్మన్‌ షర్మిలారెడ్డి, ఏఎస్పీలు లతామాధురి, పాపారావు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

 


రాజమహేంద్రవరం: ధీరులకు సెల్యూట్‌

రాజమహేంద్రవరం:పోలీసుల కుటుంబ సభ్యులకు చెక్కు ఇస్తున్న అర్బన్‌ ఎస్పీ

రస్తోగి, ఎంపీ భరత్‌, ఎమ్మెల్యే రాజా


కాకినాడ: పోలీసు కుటుంబ సభ్యుల ఉద్వేగం


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని