కాకినాడ మేయర్‌ పీఠంపై ఉత్కంఠ
eenadu telugu news
Published : 22/10/2021 05:59 IST

కాకినాడ మేయర్‌ పీఠంపై ఉత్కంఠ

కాకినాడ కలెక్టరేట్‌: కాకినాడ మేయర్‌ పీఠంపై శుక్రవారం హైకోర్టులో తీర్పు వెలువడనుంది. ఈ తీర్పు మేయర్‌ పావనికి అనుకూలంగా వస్తుందా.. ప్రతికూలంగా ఉంటుందా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కొత్త మేయర్‌, ఉప మేయర్‌-1 ఎన్నికకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం లేఖ ఆధారంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ బుధవారం ఈ ఎన్నికకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 25న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. గురువారం కార్పొరేటర్లకు సమావేశపు నోటీసులు అందజేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో గురువారం కార్పొరేటర్లు,ఎక్స్‌అఫీషియో సభ్యులకునోటీసుల అందజేత ప్రారంభించారు.ఈనెల 25న ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశాన్ని జేసీ లక్ష్మీశ అధ్యక్షతన నిర్వహించనున్నారు. ఈమేరకు జేసీని ప్రిసైడింగ్‌ అధికారిగా... కలెక్టర్‌ హరికిరణ్‌ నియమించారు. ఇదిలా ఉండగా.. మేయర్‌ పీఠంపై శుక్రవారం తీర్పు నేపథ్యంలో పావనికి తీర్పు అనుకూలంగా వస్తే పరిస్థితి ఏంటనే ఆసక్తి నెలకొంది. ప్రతికూలంగా వస్తే కొత్త మేయర్‌, ఉపమేయర్‌-1 ఎన్నికకు మార్గం సుగమమైనట్లు అవుతుంది. శుక్రవారం కోర్టు తీర్పు ఆధారంగా తదుపరి క్రతువు ముందుకు సాగే వీలుంది.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని