పారదర్శకంగా లబ్ధిదారుల గుర్తింపు
eenadu telugu news
Published : 22/10/2021 05:59 IST

పారదర్శకంగా లబ్ధిదారుల గుర్తింపు

కాకినాడ కలెక్టరేట్‌: రెండో విడత రైతు భరోసా, రైతులకు సున్నా వడ్డీ రుణాలు, విద్యాదీవెన, ఇతర పథకాలకు సచివాలయాల వారీగా లబ్ధిదారులను పారదర్శకంగా గుర్తించి.. అర్హుల జాబితా రూపొందించాలి.. సామాజిక తనిఖీ తదితర ప్రక్రియలు పూర్తి చేయాలని సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు.సీఎం తన విడిది కార్యాలయం నుంచి 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ సి.హరికిరణ్‌, జేసీలు లక్ష్మీశ, కీర్తి, భార్గవ్‌తేజ, జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు హాజరయ్యారు. సంక్షేమ పథకాల అమలు తీరు, గ్రామ, వార్డు సచివాలయాల వారీగా తనిఖీలపై సీఎం సమీక్షించారు. డీఆర్వో సత్తిబాబు, జడ్పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, డ్వామా పీడీ వెంకటలక్ష్మి, డీఎంహెచ్‌వో గౌరీశ్వరరావు, వ్యవసాయశాఖ జేడీ విజయకుమార్‌, పంచాయతీరాజ్‌శాఖ ఎస్‌ఈ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని