అధినేత దీక్షకు మేముసైతం..
eenadu telugu news
Published : 22/10/2021 05:59 IST

అధినేత దీక్షకు మేముసైతం..


అమరావతికి బయలుదేరిన బుచ్చయ్యచౌదరి, నాయకులు

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ: తెదేపా ప్రధాన కార్యాలయం, నేతల ఇళ్లపై దాడులకు నిరసనగా అధినేత చంద్రబాబుచేపట్టిన దీక్షకు మద్దతు తెలిపేందుకు జిల్లా నుంచి శ్రేణులు గురువారం తరలివెళ్లాయి. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి నేతృత్వంలో నాయకులు తరలివెళ్లారు. నాయకులు వాసిరెడ్డి రాంబాబు, మత్సేటి ప్రసాద్‌, నున్న కృష్ణ, కె.కిషోర్‌, సత్తిబాబు, రామారావు పాల్గొన్నారు.

జగ్గంపేట: తెదేపా అధినేత చేపట్టిన దీక్షకు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంఘీభావం తెలిపారు. తన అనుచరులతో తరలివెళ్లి దీక్షలో పాల్గొన్నారు. తెదేపా కార్యాలయంపై వైకాపా శ్రేణుల దాడి అమానుషమన్నారు. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం ఒక నియంతలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

చంద్రబాబుతో జ్యోతుల

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని